News July 6, 2024

ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన గోదావరి జలాలు

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణా నదిని తాకడానికి ప్రవహిస్తున్న నీరు, జక్కంపూడి సమీపంలో కొండల మధ్య ఇలా ప్రవహిస్తున్నాయి. కాగా పట్టిసీమ ఎత్తిపోతల వద్ద 16 పంపుల ద్వారా 5,664 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 12, 2024

విజయవాడ: నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే సమావేశం

image

తూర్పు నియోజకవర్గంలోని సమస్యలపై కార్పొరేషన్‌ అధికారులతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ గురువారం సమావేశం నిర్వహించారు. విజయవాడ అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించడానికి కార్పొరేషన్‌ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా రిటైనింగ్‌ వాల్‌ సమీపంలో 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేయాలని సూచించారు.

News December 12, 2024

అవంతి శ్రీనివా‌స్‌పై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు 

image

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై బుద్ధా వెంకన్న Xలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ పాలనలో నువ్వు, జగన్ సర్వం నాకేశారని, నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకే ద్రోహం చేశావు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి నిన్ను తీసుకువెళ్లిన చంద్రబాబును అవమానించిన నీ సానుభూతి కూటమి పాలనకు అవసరం లేదు’ అని పోస్ట్ చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్, ఊసరవెల్లి ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు.

News December 12, 2024

క‌ృష్ణా: ఏ క్షణమైనా గౌతమ్ రెడ్డి అరెస్ట్ 

image

వైసీపీ నేత గౌతమ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కోర్టు బెయిల్ కొట్టి వేయడంతో అరెస్ట్‌కు మార్గం సుగమైంది. విజయవాడకి చెందిన ఉమామహేశ్వర శాస్త్రి స్థలం కబ్జా, హత్యాయత్నం కేసుకు సంబంధించి గౌతమ్‌ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆయన కోసం పోలీసుల పత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏ క్షణమైనా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లు చెప్పారు.