News April 10, 2024
ఎన్టీఆర్: జిల్లాలో ఈనెల 13న నిజం గెలవాలి ముగింపు సభ

చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ముగింపు సభను ఈ నెల 13న ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా గత 6 నెలలుగా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి వారికి ఆర్థిక సాయం అందచేశారు. ఈ మేరకు సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నేత కేశినేని చిన్ని చెప్పారు.
Similar News
News March 20, 2025
ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదు

కృష్ణాజిల్లాలోని ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. గురువారం ఎస్‌ఐ విశ్వనాధ్ వివరాల మేరకు.. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన బాలికపై అదే కాలనీలో నివావసముంటున్న చందు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 20, 2025
కష్ణా: ‘డాక్టర్ శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలి’

కృష్ణాజిల్లా అవనిగడ్డలో డా. కే శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 2020వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీబీసీఐడి విచారణ చేపట్టి డాక్టర్ కోట శ్రీహరి హంతకులను పట్టుకోవాలని కోరారు.
News March 20, 2025
గన్నవరం: బాలికపై అఘాయిత్యం.. వెలుగులోకి కీలక విషయాలు

గన్నవరం మండలంలో బాలికపై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అపహరించి 14 మధ్యాహ్నం వరకు పారిశ్రామికవాడలో నిర్బంధించారు. 14న కేసరపల్లిలో ఖాళీ గదికి తరలించి, 17వరకు మద్యం, గంజాయి ఇచ్చి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం విజయవాడలో వదిలేశారు. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారంతా గంజాయి కేసుల్లో పాత నేరస్థులని గుర్తించారు.