News June 7, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల కోడ్ నిలుపుదల: ఢిల్లీ రావు

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉందన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News December 10, 2024

13న స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం: కలెక్టర్

image

విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడిచే స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కలెక్టర్‌ డా.జి.లక్ష్మిశా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.

News December 10, 2024

గుడివాడ: కళాశాలకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలిక

image

గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్మెన్‌గా ఉన్న దుర్గారావు కుమార్తె ప్రియాంక అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న యువతి, శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వివాహితుడు రాహుల్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ పై టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు.

News December 10, 2024

తిరువూరు నుంచి Dy.CM పవన్‌కు బెదిరింపు కాల్స్

image

Dy.CM పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా పోలీసులు గుర్తించారు. ఇతను పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందగా..పోలీసులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఏరియాలో ఆరా తీయగా అతని జాడలేదు.అతనే ఫోన్ చేశాడా.. ఎవరైనా అతని పేరుపై సిమ్ తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది.