News April 28, 2024
ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల వివరాలు ఇలా..!

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 17,04,007 కు చేరుకుంది. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్ల సంఖ్య ఇలా..!
తిరువూరు: 2,07,190
విజయవాడ పశ్చిమ:  2,55,963
విజయవాడ సెంట్రల్: 2,77,724
విజయవాడ తూర్పు: 2,70,624
మైలవరం:  2,81,732
నందిగామ: 2,05,480
జగ్గయ్యపేట:2,05, 364
Similar News
News October 31, 2025
తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు: ఎస్పీ హెచ్చరిక

పత్రికా స్వేచ్ఛ ముసుగులో ప్రభుత్వ వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేసే చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో అవనిగడ్డ మండలం రామకోటిపురం సర్పంచ్ను ఫొటో ఎగ్జిబిషన్ వద్ధకు రానివ్వలేదని ఓ పత్రిక ప్రచురించిన వార్తపై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంక్షలను వక్రీకరించి తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News October 31, 2025
కృష్ణా జిల్లాలో పలు మండలాలకు క్రీడా సామాగ్రి సరఫరా

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, ఉయ్యూరు మండలాల క్లస్టర్ పాఠశాలలకు క్రీడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష అధికారులు కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు రాంబాబు, అరుణ తెలిపారు. సంబంధిత మండలాల పీఈటీలు వారి క్లస్టర్కు కేటాయించిన స్పోర్ట్స్ మెటీరియల్ను స్వీకరించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.


