News January 26, 2025
ఎన్టీఆర్ జిల్లాలో నేడు ఆ రెండు బంద్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Similar News
News November 7, 2025
ఆస్ట్రోనాట్గా కైవల్యా రెడ్డి ఎంపిక.. పవన్ అభినందనలు

నిడదవోలుకు చెందిన కైవల్యా రెడ్డి అమెరికాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029 అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైంది. కైవల్యా రెడ్డి ఎంపిక కావడం చాలా గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ అంతరిక్ష శిక్షణ కార్యక్రమంలో ఆమె గొప్ప విజయాన్ని సాధించాలన్నారు. కైవల్యా తండ్రి శ్రీనివాసరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
News November 7, 2025
ATP: డిసెంబర్లో పెళ్లి.. అంతలోనే!

డిసెంబర్లో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం నెలకొంది. రాబోయే కొత్త జీవితం కోసం కలలు కన్న రామును కోల్పోవడం కుటుంబానికి తట్టుకోలేని విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపప్పూరు(M) చాగల్లులో గ్రామానికి చెందిన రాము(23) గురువారం టెంకాయ చెట్టును కొడుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
News November 7, 2025
నంద్యాల మీదుగా స్పెషల్ రైళ్లు

నంద్యాల జిల్లా అయ్యప్ప స్వాములు, ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నంద్యాల మీదుగా కేరళలోని శబరిమలైకి 10 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు. మచిలీపట్నం నుంచి కొల్లం వరకు 5 ప్రత్యేక రైళ్లు, కొల్లం నుంచి నంద్యాల వైపు 5 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ అధికారులకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.


