News March 17, 2025
ఎన్టీఆర్ జిల్లాలో 268 మంది విద్యార్థులు గైర్హాజరు

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. రిజిస్టర్ అయిన 27,711 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 27,443 మంది హాజరయ్యారు. 44 మంది ప్రైవేటు విద్యార్థులకు 39 మంది హాజరైనట్లు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. తాను 11 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అధికారులకు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
ప్రాజెక్టులకు 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్: CM

AP: పరిశ్రమల ఏర్పాటు కోసం 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంచామని CM CBN చెప్పారు. CII సదస్సు పెట్టుబడుల కోసమే కాదని, మేధో చర్చల కోసం ఏర్పాటు చేశామన్నారు. సంప్రదాయాలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను నెలకొల్పుతున్నామన్నారు. డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని చెప్పారు. అనేక దేశాల ప్రతినిధులు సదస్సుకు రావటం సంతోషం కలిగిస్తోందన్నారు.
News November 14, 2025
NRPT: నేటి బాలలే రేపటి పౌరులు: కలెక్టర్

నేటి బాలలే రేపటి పౌరులని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట పట్టణంలోని పళ్ళ వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో ముందుండాలని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News November 14, 2025
కల్వకుర్తి: బీసీ బాలుర వసతి గృహం సంఘటనపై విచారణ

కల్వకుర్తి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతి గృహంలో దాదాపు 30 మంది విద్యార్థులను అకారణంగా అతిథి ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటనపై స్థానిక ఎంఆర్ఓ ఇబ్రహీం శుక్రవారం సాయంత్రం విచారణ చేపట్టారు. హాస్టల్ వద్దకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణకు సంబంధించిన రిపోర్టు ఉన్నతాధికారులకు అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.


