News January 29, 2025

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక నిర్ణయం 

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరంలోని పాకిస్థాన్‌ పేరుతో ఉన్న కాలనీ పేరును ఎట్టకేలకు మార్చారు. పాకిస్థాన్‌ కాలనీ పేరు మార్చాలంటూ కాలనీ వాసులు కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు స్పందించిన ఆయన భగీరథ కాలనీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెను వెంటనే అదే కాలనీలో ఆధార్ కేంద్రం సైతం ప్రారంభించి కాలనీ వాసులు పేరు మార్చుకోవాలని సూచించారు. 

Similar News

News December 7, 2025

వెంకటాపురం భార్యాభర్తలు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌

image

వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ముగియడంతో గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్‌గా శకుంతలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఆమె భర్త వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమై, ఆపై ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషం. ఇకపై ఈ భార్యాభర్తలు పదవుల్లో కొనసాగనున్నారు.

News December 7, 2025

విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.