News March 9, 2025
ఎన్టీఆర్: జిల్లా టీడీపీ నేతలకు ఈసారి మొండిచెయ్యి

MLA కోటాలో MLC స్థానాలకు టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ఆదివారం ఎంపిక చేసింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆరుగురు నాయకులు పదవి ఆశించినప్పటికీ వారికి పదవీయోగం లభించలేదు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడును టీడీపీ తమ MLC అభ్యర్థులుగా ఎంపిక చేసింది. కాగా ఒక సీటును బీజేపీకి కేటాయించగా, జనసేన నుంచి ఆ పార్టీ నేత నాగబాబును పవన్..MLC అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 10, 2025
రష్మిక మందన్నకు ప్రాణభయం: కొడవ వర్గం ఆందోళన

నటి రష్మిక మందన్న ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ఆమెను రాజకీయాల్లోకి లాగిందని విమర్శించారు. ఆమెకు ముప్పు ఉందని, ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల KA <<15639271>>MLA <<>>ఒకరు ఆమెకు తగిన బుద్ధి చెప్తామని బెదిరించడం తెలిసిందే. KAలోని కొడగు ప్రాంతంలో కొడవ వర్గానిదే ఆధిపత్యం. సంప్రదాయ హిందువులైన వీరు కొడవ భాష మాట్లాడతారు. రష్మిక ఈ వర్గానికే చెందుతారు.
News March 10, 2025
భీమిలి: గుండెపోటుతో టీచర్ మృతి

భీమిలి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఇన్విజిలేటర్ గా ఉన్న డి.మాధవరావు(55) పరీక్షా కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. రేకవానిపాలెం ఎంపీపీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఇంటర్ ఇన్విజిలేషన్ విధులు అప్పగించారు. ఈమేరకు సోమవారం ఉ.8గంటలకు పరీక్షా కేంద్రంలో ఆయన కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News March 10, 2025
HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.