News March 10, 2025
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదివారం కీలక ప్రకటన చేశారు. నగరంలో ముఖ్యమైన కూడలిల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిగ్నల్ పడినప్పుడు వైట్ లైన్ వద్ద ఆగాలని లేనిచో కమాండ్ కంట్రోల్ ద్వారా ఇంటికి ఈ చలానా నోటీసులు వస్తాయని సూచించారు. అలాగే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి కూడా జరిమానాలు విధిస్తామని సూచించారు.
Similar News
News November 19, 2025
మెదక్: తండ్రి దాడిలో గాయపడ్డ వంశీని పరామర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న వంశీని కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో మద్యం మత్తులో తండ్రి కొడుకు వంశీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ వద్దకు వెళ్లి కలెక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
News November 19, 2025
ఉమ్మడి కరీంనగర్లో BCలకు 268 GPలే..!

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.