News March 16, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అలెర్ట్

జిల్లాలో నేడు 9 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ అర్బన్ & రూరల్ 40.7, వీరులపాడు 41.2, పెనుగంచిప్రోలు 41.3, నందిగామ 41.4, జి.కొండూరు 40.7, చందర్లపాడు 41.4, ఇబ్రహీంపట్నం 41, కంచికచర్ల 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందన్నారు.
Similar News
News December 4, 2025
కొయ్యలగూడెం RWS కార్యాలయంపై ACB దాడులు

కొయ్యలగూడెం ఆర్డబ్ల్యూఎస్ (RWS-రూరల్ వాటర్ సప్లై) కార్యాలయంలో ACB అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఓ కాంట్రాక్టర్ నుండి భారీ మొత్తంలో నగదు లంచం తీసుకుంటుండగా RWS శాఖకు చెందిన ఇరువురు అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2025
రాజన్న సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గరిమ అగ్రవాల్, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కుమార్తో కలిసి గురువారం హాజరయ్యారు.
News December 4, 2025
ఏలూరు మెడికల్ కాలేజీలో సద్దుమణిగిన వివాదం

ఏలూరు మెడికల్ కాలేజీలో జూనియర్లు, సీనియర్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. సీనియర్లు తమపై దాడి చేశారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం జూనియర్లు సీనియర్లపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వివాదాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ వారికి సూచించారు.


