News March 16, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అలెర్ట్

జిల్లాలో నేడు 9 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ అర్బన్ & రూరల్ 40.7, వీరులపాడు 41.2, పెనుగంచిప్రోలు 41.3, నందిగామ 41.4, జి.కొండూరు 40.7, చందర్లపాడు 41.4, ఇబ్రహీంపట్నం 41, కంచికచర్ల 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందన్నారు.
Similar News
News April 20, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: నిర్మల్ కలెక్టర్

రైతుల సౌకర్యార్థం నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
News April 20, 2025
16,347 పోస్టులు: జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..

AP: రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉ.10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్, జోన్ లెవెల్‌లో 2,259 పోస్టులున్నాయి. అలాగే 7,487 స్కూల్ అసిస్టెంట్లు, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీలున్నాయి. 13 ఉమ్మడి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి ఖాళీల వివరాల కోసం <
#SHARE
News April 20, 2025
AP మెగా డీఎస్సీ: షెడ్యూల్ ఇలా

✒ మొత్తం టీచర్ పోస్టులు:16,347
✒ నోటిఫికేషన్ విడుదల: 20-4-2025
✒ దరఖాస్తులు: ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు
✒ హాల్‌టికెట్ల విడుదల: మే 30
✒ పరీక్షలు: CBT విధానంలో జూన్ 6 నుంచి జులై 6 వరకు
✒ ప్రాథమిక కీ విడుదల: చివరి పరీక్ష ముగిసిన 2 రోజులకు
✒ అభ్యంతరాల స్వీకరణ: కీ విడుదలైన 7 రోజుల వరకు
✒ ఫైనల్ కీ విడుదల: జులై మూడో వారం
✒ మెరిట్ లిస్టు: జులై చివరి వారం