News October 11, 2024

ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

image

కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని ఎన్టీఆర్ జిల్లా ప్రజలను పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద పార్సిల్ వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు..ప్రజల బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని కోరింది.

Similar News

News November 6, 2024

కృష్ణా జిల్లాకు వర్ష సూచన

image

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం తెలిపింది. ఈ మేరకు రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలలో ఎవరూ తిరగొద్దని పేర్కొంది. చెట్ల కింద నిల్చోవద్దని, ఆరు బయట ధాన్యాన్ని ఉంచవద్దని ఏపీ విపత్తుల శాఖ సూచించింది.

News November 6, 2024

విజయవాడ: పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు

image

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పంచ్‌ ప్రభాకర్‌పై విజయవాడలో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మొగల్రాజపురానికి చెందిన డి.రాజు అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్‌ క్రైం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కాగా చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి ‘పంచ్ ప్రభాకర్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు.

News November 6, 2024

ఆగిరిపల్లి: శిక్షణ పొందుతున్న హెచ్ఎం గుండెపోటుతో మృతి 

image

ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలోని హీల్ పారడైజ్ పాఠశాల ఆవరణలో శిక్షణ పొందుతున్న ఉండి మండలం ఇనకుదురు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం టీవీ. రత్నకుమార్ గుండెపోటుతో బుధవారం మృతిచెందాడు. 3 రోజులుగా హెచ్ఎంలకు శిక్షణ ఇస్తుండగా, రత్నకుమార్ హఠాత్తుగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం రత్నకుమార్ మృతిపట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.