News March 28, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలు జాగ్రత్త

జిల్లాలో నేడు పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. వడగాలులకు గురవ్వకుండా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ మేరకు తమ X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు 43.3, గంపలగూడెం 42.3, మైలవరం 43.1, నందిగామ 43.4, రెడ్డిగూడెం 42.2, వీరులపాడు 43.7, విస్సన్నపేట 41.6, విజయవాడ అర్బన్ & రూరల్ 42.5
Similar News
News July 6, 2025
ఉమ్మడి ప.గో వ్యాప్తంగా 6, 465 కేసులు రాజీ

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6, 324 పెండింగ్ కేసులను 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీవ్ చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. మొత్తం 6,465 కేసులను రాజీ జరిగాయన్నారు. మోటార్ వాహన ప్రమాద కేసులు 129, సివిల్ 219, క్రిమినల్ 5,976 అలాగే 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
News July 6, 2025
KMR: ‘రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలి’

సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లోనే ఉపయోగించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు ఆదేశించారు. కామారెడ్డిలో శనివారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికి రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. భూ భారతి చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.
News July 6, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విద్యా శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి, రెండో దశలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి గురించిన వివరాలను డీఈవో వాసంతి, ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వివరించారు.