News March 19, 2025
ఎన్టీఆర్ జిల్లా TODAY TOP NEWS

*విజయవాడ: స్నానానికి వెళ్లి బాలుడు మృతి. * పెనుగంచిప్రోలు: పోలీసులపై దాడి కేసు నమోదు. * బ్యాడ్మింటన్ ఆట సరిగ్గా ఆడలేదని కోచ్ దాడి. * పెనుగంచిప్రోలు: ఎగ్జిబిషన్లో ప్రమాదం.. వ్యక్తి మృతి. *విజయవాడ: మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత బుద్ధ ఫైర్. *విజయవాడలో సందడి చేసిన కోర్ట్ సినిమా యూనిట్. * విజయవాడ: దోమల నివారణకు చర్యలు.
Similar News
News December 7, 2025
ఈ ఆలయాలకు వెళ్తే..

మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ శని దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో ఇళ్లు, షాపులకు తలుపులు ఉండవు. న్యాయాధిపతి శని దేవుడి మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. శని ధామ్(ఢిల్లీ), కోకిలవ ధామ్(UP), తిరునల్లార్(తమిళనాడు) ఆలయాలను దర్శించడం వల్ల కూడా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News December 7, 2025
GWL: సైబర్ మోసంలో రూ.4.33 లక్షలు రికవరీ

మల్దకల్ మండలంలో నమోదైన సైబర్ మోసం కేసును గద్వాల సైబర్ వింగ్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సైబర్ మోసానికి గురైన బాధితుడి నుంచి రూ.4.33 లక్షలు రికవరీ చేసి, అతని ఖాతాలో జమ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. రికవరీ చేసిన నగదు పత్రాలను బాధితుడికి అందజేసి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News December 7, 2025
కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.


