News May 23, 2024
ఎన్టీఆర్: జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు
ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 19, 2024
పోరంకిలో దొంగకు దేహశుద్ధి
పోరంకిలో మంగళవారం ఉదయం దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. పెనమలూరుకు చెందిన వృద్ధురాలిని పీక నొక్కి ఆమె మెడలో ఉన్న బంగారం చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 19, 2024
కృష్ణా: ఆ రైళ్లకు కొత్త నంబర్లు
ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 4 రైళ్లకు 2025 మార్చి 1 నుంచి కొత్త నంబర్లను రైల్వే శాఖ కేటాయించింది. నం.17487 & 17488 విశాఖపట్నం- కడప మధ్య ప్రయాణించే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లకు నూతనంగా 18521 & 18522 నంబర్లను కేటాయించింది. అదేవిధంగా 22701 & 22702 విశాఖపట్నం- గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లకు 22875 & 22876 నంబర్లను కేటాయించామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
News November 19, 2024
గుడివాడలో లంచం తీసుకున్న కేసులో సీఐ సస్పెండ్
రాజమండ్రి టూ టౌన్ సీఐ దుర్గారావుని ఉన్నతాధికారులు సోమవారం సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 2022లో గుడివాడ టూ టౌన్‌లో దుర్గారావు సీఐగా పనిచేస్తున్న సమయంలో భూ వివాదం కేసులో రెండు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించారు. ఈ వివాదంలో ఓ వర్గంవారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలపై బాధితుడు ఏసీబీ వారిని ఆశ్రయించాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సీఐ సస్పెండ్‌కు గురయ్యారు.