News January 30, 2025

ఎన్టీఆర్: డిగ్రీ (డిస్టెన్స్) పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో 2024 అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయ్యద్ జైనులబ్ధీన్ తెలిపారు. బీఏ, బీకామ్(జనరల్&కంప్యూటర్స్) 1,2,3వ సెమిస్టర్ పరీక్షల రెగ్యులర్&సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామని, http://anucde.info/‌లో చూడాలన్నారు. రీవాల్యుయేషన్‌కై అభ్యర్థులు ఫిబ్రవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 20, 2025

కామారెడ్డి జిల్లాకు నూతన DCCB?

image

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లి., పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కలెక్టర్‌ను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాకు చెందిన DCCBని రెండు జిల్లాలకు అనుగుణంగా పునర్‌వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో KMR జిల్లాలో నూతన DCCB ఏర్పాటు కానున్నట్లు సమాచారం.

News December 20, 2025

ASF: పంచాయతీ పోరులో సగం.. సత్తా చాటిన మహిళలు

image

ASF జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడ్డారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్లు గెలుపొందారు. మొదటి విడతలో 60 మంది, 2వ విడతలో 54, 3వ విడతలో 56 మహిళలు ఎన్నికయ్యారు.

News December 20, 2025

కామారెడ్డి: లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలి

image

కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, బీడీ కార్మికులు, ఇతర కంపెనీల్లో పనిచేసి పదవి విరమణ పొంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు ఈ నెలాఖరులోగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయనివారు మీసేవా కేంద్రాల్లో అందజేయాలన్నారు.