News March 9, 2025
ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్(రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మార్చి 19వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.800 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ పి.వీరబ్రహ్మం తెలిపారు.
Similar News
News March 24, 2025
సంచలనం.. రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్ట్’!

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.50.80 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దాదాపు రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి భారీ లాభాలను పొందింది. థియేటర్ కలెక్షన్లతో పాటు శాటిలైట్, ఓటీటీ రైట్స్‌కు మరిన్ని లాభాలొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News March 24, 2025
అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన

పరిహారం చెల్లించిన తర్వాతే రహదారి పనులు మొదలు పెట్టాలని అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో రోడ్డు నిర్వాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ బ్రహ్మాజీ, ఆర్ రాము మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లు ఇస్తే వీరికి ఉపయోగం లేదన్నారు. బాండ్ల స్థానంలో నగదు చెల్లించాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు.
News March 24, 2025
గద్వాల: ‘నీళ్లు ఇచ్చే దాకా కదలం’

అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్‌డీఎస్ రైతులు సాగు నీళ్ల కోసం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సుమారు పన్నెండు గ్రామాల రైతులు మాట్లాడుతూ.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగు నీరు అందించాలని కోరారు. నీళ్లు ఇచ్చేదాకా కదలమని భీష్మించుకుని కూర్చున్నారు.