News April 9, 2025
ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో UG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 21 నుంచి మే 2 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
Similar News
News April 17, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> పాలకుర్తిలో వైద్యుల నిర్లక్ష్యం శిశువు మృతి చిల్పూర్‌లో భూభారతిపై అవగాహన సదస్సు > కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి > జనగామ: మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా > పసికందు మృతిపై స్పందించిన కలెక్టర్ > పశ్చిమబెంగాల్ లో హిందువులపై దాడిని ఖండిస్తూ జనగామలో నిరసన > అధికారులు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్ > నర్మెట్టలో పామాయిల్ తోట దగ్ధం
News April 17, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ జనసేనలో చేరిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు ➤వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక➤కలెక్టరేట్లో దిశా మీటింగ్ నిర్వహించిన ఎంపీ భరత్ ➤ఈ నెల 24 నుంచి సింహాద్రి అప్పన్న చందనం అరగదీత ➤పలు హాస్టల్లో తనిఖీలు చేసిన మంత్రి డోలా ➤ POCSO చట్టంపై అవగాహన కల్పించిన హోంమంత్రి ➤ APR 30 వరకు పన్ను వడ్డీపై 50% రాయితీ ➤దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రోగ్రాంకు అనుమతి ఇచ్చిన పోలీసులు
News April 17, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి: మాజీ మంత్రి

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.