News January 29, 2025
ఎన్టీఆర్: డిగ్రీ వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(Y15 నుంచి Y17 బ్యాచ్లు) 4వ సెమిస్టర్ వన్ టైం ఆపర్చ్యూనిటీ థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 20లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మార్చి 25 నుండి నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.
Similar News
News January 7, 2026
ఏయూలో బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు

భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT)కి చెందిన బిరాక్ (BIRAC) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయో నెస్ట్ (Bio NEST) బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు అమోదం లభించింది. 3 సంవత్సరాల కాలానికి మొత్తం రూ.5 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ శతాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం కిరీటంలో మరొక కలికితురాయిగా నిలవనుందని రిజిస్ట్రార్ తెలిపారు.
News January 7, 2026
‘జన నాయకుడు’ విడుదలపై వీడని ఉత్కంఠ

విజయ్ ‘జన నాయకుడు’ సినిమా విడుదలకు గండం తప్పేలా లేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా తీర్పు రిజర్వ్ చేసింది. ఈనెల 9న సినిమా విడుదల కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్పే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. దీంతో సినిమా విడుదల టెక్నికల్గా వాయిదా పడినట్టేనని తెలుస్తోంది.
News January 7, 2026
మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి డైలీ బస్సులు

మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి బస్సులు శుక్రవారం నుంచి ప్రతి రోజు నడుస్తాయని డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. ఎక్స్ ప్రెస్ సర్వీసు ప్రతిరోజు ఉదయం 6 గంటల బయలుదేరి 9 చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4 బయలుదేరి 7 గంటల వరకు మహబూబాబాద్కు వస్తుందని ఆమె తెలిపారు. పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.160 టికెట్ ధర ఉంటుందన్నారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు.


