News July 19, 2024

ఎన్టీఆర్: డీసీపీగా గౌతమ్ శాలి బాధ్యతలు

image

ఎన్టీఆర్ జిల్లా లా అండ్ ఆర్డర్ డీసీపీగా గౌతమ్ శాలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా నేరుగా వచ్చి తనను సంప్రదించవచ్చన్నారు. గతంలో ఆమె అనంతపురం ఎస్పీగా పని చేసి విజయవాడ డీసీపీగా వచ్చారు.

Similar News

News December 1, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపటిలోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News December 1, 2024

ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయి అమ్మిన సరఫరా చేసిన వారితో సత్సంబంధాలు కొనసాగించిన గంజాయ్ షీట్ తెరుస్తామని సెంటర్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. విజయవాడలో నేడు ఆయన మాట్లాడుతూ.. గంజాయి విషయంలో ఒక కేసుకు మించి ఎన్ని కేసులున్నా రౌడీషీటు తెరుస్తామని స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందవంటూ హెచ్చరించారు.

News December 1, 2024

కృష్ణా: CM చంద్రబాబు నిర్ణయంపై మీరేమంటారు

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు ఫోన్ చేసి పింఛన్ అందిందా లేదా అని అడిగే వ్యవస్థను తీసుకొస్తామని CM చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో IVRS ద్వారా ఆయన పథకాల లబ్ధిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. కాగా ఉమ్మడి కృష్ణాలో 4,70,210 మంది పింఛన్ లబ్దిదారులుండగా రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఉన్నారు. సీఎం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా మీ స్పందన ఏమిటో తెలియజేయండి.