News August 26, 2024
ఎన్టీఆర్: తేలు కుట్టి పదేళ్ల బాలుడు మృతి
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. తేలు కుట్టి పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగచరణ్ ఆడుకుంటుండగా తేలు కుట్టింది. విషయాన్ని బాలుడు ఇంట్లో ఆలస్యంగా చెప్పాడు. దీంతో ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బాలుడు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Similar News
News September 9, 2024
విజయవాడ: వరద బాధితులకు రూ.కోటి విరాళం
లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని సోమవారం అందజేశారు. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్‌లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు అభినందించి, వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.
News September 9, 2024
విజయవాడ: వరద విపత్తు వేళ దొంగల చేతివాటం
వరద బాధిత ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇటీవల నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మొబైల్స్ షాపు, మద్యం దుకాణంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. నీళ్లలో మునిగిన బైక్‌లలో పెట్రోల్, టైర్లు చోరీ అయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలో మునిగిన బైక్‌లను ఆగంతుకులు తుక్కు కింద అమ్మేస్తున్నారని ముంపు ప్రాంతాల వారు చెబుతున్నారు.
News September 8, 2024
కృష్ణా జిల్లాలో పలు రైళ్ల రద్దు
నిర్వహణ కారణాల రీత్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రయాణించే కింది రైళ్లను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేశామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం తెలిపింది. రాజమండ్రి- విజయవాడ (07460), విజయవాడ- మచిలీపట్నం (07895) , మచిలీపట్నం- విజయవాడ (07896), విజయవాడ- మచిలీపట్నం (07769), మచిలీపట్నం- గుడివాడ (07872), గుడివాడ- మచిలీపట్నం (07871), మచిలీపట్నం- విజయవాడ (07899).