News April 4, 2024

ఎన్టీఆర్: తొలిసారి పోటీకి దూరంగా దేవినేని

image

సోదరుడు రమణ మరణానంతరం 1999 నుంచి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దేవినేని ఉమ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1999, 2004లో నందిగామలో గెలిచిన ఉమ ఆ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2009,14,19లో మైలవరంలో పోటీ చేశారు. 2019లో మినహా ఆయన ప్రతిసారి గెలుపు సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికలలో టీడీపీ అధిష్ఠానం మైలవరం టికెట్ వసంతకు కేటాయించడంతో ఉమ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.

Similar News

News December 7, 2025

కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

image

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.

News December 7, 2025

మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

image

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.

News December 7, 2025

కృష్ణా: స్క్రబ్ టైఫస్‌తో వ్యక్తి మృతి

image

ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన శివశంకర్‌ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల 2న శాంపిల్స్ తీసుకోగా, రిపోర్ట్ రాకముందే 4వ తేదీన ఆయన మృతి చెందారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది.