News March 13, 2025

ఎన్టీఆర్: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పలు విభాగాలలో డైరెక్టర్లు, మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో గురువారంలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 22, 2025

సింగరేణి శుభవార్త.. 1,258 మంది ఉద్యోగులు పర్మినెంట్

image

కొత్తగూడెం: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 1,258 మంది తాత్కాలిక ఉద్యోగులను ఇకనుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లో వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News November 22, 2025

విజయవాడ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

image

విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఏలూరుకు చెందిన యువకుడు తేజ వికాస్ మహిళ గొంతుతో మాట్లాడేవాడు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రవి రోగిని పరీక్షించి ప్యూబర్ఫోనియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీని కోసం టైప్-3 థైరొప్లాస్టీ శస్త్రచికిత్స ఉత్తమ మార్గమని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం రోగికి మహిళ వాయిస్ పోయి, పురుషుడు గొంతుతో మాట వస్తోందన్నారు.

News November 22, 2025

భద్రాద్రి: ‘హిడ్మాను పట్టుకొని చంపేశారు’

image

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజేలను పోలీసులు ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆ తర్వాతే ఎన్‌కౌంటర్ పేరిట కట్టుకథలు చెబుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైంది. హిడ్మా హత్యను నిరసిస్తూ, ఈ నెల 23న దేశవ్యాప్తంగా బంద్‌ పాటించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. నవంబరు 20న రాసిన ఈ లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది.