News March 12, 2025
ఎన్టీఆర్: నేడు ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.చందర్లపాడు 40.2, జి.కొండూరు 39.9, ఇబ్రహీంపట్నం 41, కంచికచర్ల 40.2, విజయవాడ రూరల్ 40.3, విజయవాడ అర్బన్ 40.2.
Similar News
News November 26, 2025
తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News November 26, 2025
కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

కదిరి టౌన్లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
News November 26, 2025
ఉమ్మడి ఖమ్మం నుంచే సీఎం పంచాయతీ ఎన్నికల శంఖారావం..!

సీఎం రేవంత్ రెడ్డి స్థానికసంస్థల ఎన్నికల శంఖారావాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పూరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబరు 2న కొత్తగూడెం పరిధి లక్ష్మిదేవిపల్లిలో ఎర్త్సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భద్రాద్రి రామయ్య దీవెనలతో పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని సీఎం భావిస్తున్నారట. సీఎం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


