News February 6, 2025

ఎన్టీఆర్: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షలను ఈ నెల 18, 20, 22, 24వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

Similar News

News February 23, 2026

225 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>ESI <<>>కార్పొరేషన్‌లో 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి గడువును పెంచారు. మార్చి 3వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500 ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 23, 2026

దుక్కి సమస్య నేలల్లో బాగా మొలక రావాలంటే?

image

మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువుగా దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇక్కడ వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పంట సరిగా మొలకెత్తదు. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ (లేదా) పళ్లదంతెతో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.

News February 23, 2026

భూపాలపల్లి: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

image

భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో 12 మండలాలు ఉండగా 8 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. 34 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. ప్రథమ సంవత్సరంలో 1,842, ద్వితీయ సంవత్సరంలో 1,996 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.