News April 12, 2025

ఎన్టీఆర్: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో లా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన LLB 1వ, BA.LLB 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 22, 24, 26, 29, మే 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

Similar News

News November 24, 2025

ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

image

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 24, 2025

మండపేటలో మంత్రి పర్యటన రద్దు

image

మంత్రి నాదెండ్ల మనోహర్ మండపేట పర్యటన రద్దయిందని ఏపీ ఐఐసీ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తెలిపారు. మంత్రి మంగళవారం మండపేటలో సూర్య కన్వెన్షన్ హాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామన్నారు.

News November 24, 2025

రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

image

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.