News March 25, 2025
ఎన్టీఆర్: పరీక్షల నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2025లో నిర్వహించిన బీపీఈడీ, డీపీఈడీ 1వ సెమిస్టర్(2024 -25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
Similar News
News March 31, 2025
UPDATE: చెరువులో దూకిన వ్యక్తి శవం లభ్యం

తూప్రాన్ పట్టణంలోని మ్యాడక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన దాసరి యాదగిరి(40) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఉగాది సందర్భంగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యాదగిరి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలింపు చేపట్టగా సోమవారం శవం లభించింది.
News March 31, 2025
ATP: రేపు జిల్లాస్థాయి రాతిదూలం పోటీలు

అనంతపురం జిల్లా యాడికి మండలం పెద్ద పేటలో మంగళవారం జూనియర్ విభాగంలో రాతిదూలం పోటీలు నిర్వహించనున్నట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. శ్రీ సంజీవరాయ స్వామి ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి ఉన్న జిల్లా రైతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.
News March 31, 2025
కథలాపూర్లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (28) అనే యువతి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శృతి పీజీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. శృతి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రిలో చికిత్సలు చేయించిన నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.