News March 30, 2025
ఎన్టీఆర్: పరీక్షల నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిసెంబర్ 2024లో నిర్వహించిన MA, MCOM, MED 1, 3వ సెమిస్టర్ (2024 -25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోపు ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News November 1, 2025
NZB: సలహా యోగమేనా.. మంత్రి యోగం లేదా..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మూడు ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కినా, మంత్రి పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే షబ్బీర్ అలీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. తాజాగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కూడా ప్రభుత్వ సలహాదారుగా పదవి లభించింది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలోనైనా కొత్త ఎమ్మెల్యేలకు మంత్రి యోగం దక్కుతుందేమోనని ఆశలు పెట్టుకున్నారు.
News November 1, 2025
అయ్యప్ప దీక్ష: స్వామి అనే ఎందుకు పిలుస్తారు?

అయ్యప్ప మాలధారణలో ‘నేను’ అనే భావం ఉండదు. పేర్లు, వస్త్రాలు, దినచర్య.. వీటన్నింటినీ వదిలి దైవారాధనలో భాగమవుతారు. దీక్ష స్వీకరించాక తన వ్యక్తిత్వాన్ని విడిచి, అంతర్లీనంగా దైవ స్వరూపంగా మారతారు. జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో.. ఆ వ్యక్తిని ప్రత్యేకించి కాక, పరమాత్మ అంశగా చూస్తారు. అందుకే అయ్యప్ప ప్రతిరూపంగా వారిని ‘స్వామి’ అని పిలుస్తారు. ఇది ప్రతి భక్తుడిని భగవంతునిగా గౌరవించే గొప్ప ఆచారం.
News November 1, 2025
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

రాజస్థాన్ పిలానీలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<


