News March 30, 2025

ఎన్టీఆర్: పీజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన MSC, MBA, MCA 1, 3వ సెమిస్టర్(2024 -25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

Similar News

News November 23, 2025

పిల్లల్లో ఆటిజం ఉందా? ఇలా చేయండి

image

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

News November 23, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 23, 2025

OP సిందూర్‌పై పాక్ ఫేక్ న్యూస్.. తిప్పికొట్టిన ఫ్రెంచ్ నేవీ

image

ఆపరేషన్ సిందూర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్థానీ మీడియాపై ఫ్రెంచ్ నేవీ విమర్శలు గుప్పించింది. మేలో జరిగిన ఘర్షణల్లో భారత రఫేల్ జెట్లను కూల్చి పాక్ వాయుసేన ఆధిపత్యం చెలాయించిందంటూ ఓ ఫ్రెంచ్ ఆఫీసర్ చెప్పినట్లుగా అక్కడి మీడియా రాసుకొచ్చింది. అది అసత్యాలతో కూడిన కల్పిత కథనమని ఫ్రెంచ్ నేవీ పేర్కొంది. ఆ ఆఫీసర్ పేరు కూడా తప్పేనని, అతను ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేసింది.