News March 27, 2025

ఎన్టీఆర్: పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్(Y20- 23 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను మే 16 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News April 3, 2025

FLASH: వనపర్తి జిల్లాలో యాక్సిడెంట్

image

వనపర్తి జిల్లా పెబ్బేర్‌లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక భవాని వైన్స్ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న కంచిరావుపల్లి గ్రామానికి చెందిన విష్ణుచారిని AP39UC7200 నంబర్ గల లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు చేయి, కాలు నుజ్జునుజ్జయింది. పెబ్బేర్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News April 3, 2025

KMR: ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో గురువారం కలెక్టర్ కొబ్బరి కాయ కొట్టి ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News April 3, 2025

నారాయణపేట జిల్లాలో అమ్మాయిల వెంట పడితే అంతే..!

image

NRPT జిల్లాలో షీటీం సేవలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఊట్కూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు అవగాహన కల్పించారు. షీ టీం పోలీస్ అధికారి బాలరాజు మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా అమ్మాయిలను వేధించినా, వారి వెంట పడినా, అసభ్యంగా ప్రవర్తించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే షీటీం పోలీసుల నంబర్ 8712670398కి కాల్ చేయాలన్నారు. 

error: Content is protected !!