News April 9, 2025
ఎన్టీఆర్: పీ4 సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఎన్టీఆర్: పీ4 అమలుపై సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ విధానాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘మార్గదర్శి’లను గుర్తించాలన్నారు. ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి ఛైర్మన్గా స్టేట్ లెవెల్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Similar News
News November 28, 2025
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: NZB సీపీ

నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందన్నారు. జిల్లా పరిధిలో డీజేల వాడకం పూర్తిగా నిషేధం అన్నారు.
News November 28, 2025
శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు: KMR SP

భిక్కనూర్ మండలం జంగంపల్లి నామినేషన్ కేంద్రాన్ని SP రాజేష్ చంద్ర ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగాలని విధుల్లో ఉన్న సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల శాంతిభద్రతల కోసం జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు SP వివరించారు.
News November 28, 2025
PDPL: ‘ప్రతి కళాశాల నుంచి 50 మంది హాజరు కావాలి’

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రతి కళాశాల నుంచి కనీసం 50 మంది అభ్యర్థులు హాజరుకావాలని ఆదేశించారు. టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కళాశాలలు కోఆర్డినేటర్ను నియమించాలని, విద్యార్థుల నైపుణ్యాలపై అవగాహన పెంచాలని కలెక్టర్ సూచించారు.


