News March 29, 2025
ఎన్టీఆర్: పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారిన ఆ నేత

సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వంశీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ కేసులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం అట్రాసిటీ కేసుల కోర్టు తిరస్కరించింది. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID కోర్టు.. వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో వంశీ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారారు.
Similar News
News November 13, 2025
ప్రైవేట్ పాఠశాల ఛైర్మన్‌పై పోక్సో కేసు నమోదు: పరవాడ సీఐ

పరవాడ మండలం పి.బోనంగిలో ఓ ప్రైవేట్ పాఠశాల ఛైర్మన్ విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని అందిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. మాకవరపాలెం మండలానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. పాఠశాల ఛైర్మన్ ఈనెల 8న విద్యార్థినిని తన క్యాబిన్‌కు పిలిపించుకొని అకారణంగా తిట్టి, చెంపపై కొట్టాడని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 13, 2025
VKB: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి!

వికారాబాద్ జిల్లాలోని అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త. 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు (స్కాలర్షిప్లు) పొందడానికి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
News November 13, 2025
కామారెడ్డి: ఈ ప్రాణాంతక డ్రైవింగ్‌కు అడ్డుకట్టే వేయరా?

సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారిపై వాహన చోదకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ అపసవ్య దిశలో ప్రయాణించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా ప్రయాణించే రహదారిపై వాహనదారులు అడ్డంగా రావడంతో ఇతరులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ అజాగ్రత్త కారణంగా ప్రాణనష్టం, గాయాలపాలవుతున్నారు. అధికారులు తక్షణమే దృష్టి సారించి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.


