News July 15, 2024
ఎన్టీఆర్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 68 అర్జీల స్వీకరణ

విజయవాడ పోలీస్ కమీషనరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీపీ రాజశేఖర్ బాబు 68 అర్జీలను స్వీకరించినట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విజయవాడ కమీషనరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. అర్జీలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని సీపీ ఆదేశించారని కమీషనరేట్ స్పష్టం చేసింది.
Similar News
News December 16, 2025
ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

News December 15, 2025
ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి: కలెక్టర్

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. సోమవారం కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈ సంవత్సరం 149 కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా రైతులు కోతలు కోయడం వల్ల గోనె సంచులు, వాహనాల కొరత ఏర్పడిందని, మిల్లర్లు తమవంతుగా గోనె సంచులు, వాహనాలు సమకూర్చాలన్నారు.