News July 12, 2024
ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలకు అటానమస్..

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా దక్కిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదట ఈ హోదా పొందిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఏటా రూ.12 లక్షల నిధులు(UGC), రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు, ప్రతి విభాగం బలోపేతం, నూతన కోర్సులు, క్షేత్ర పర్యటనలపై దృష్టి కేంద్రీకరించి ఉద్యోగావకాశాలు పెంచి మహిళా సాధికారతకు పెద్ద పీట వేయనున్నారు.
Similar News
News February 13, 2025
బీర్ల ధరపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్

బీరుకు 30 నుంచి 40 రూపాయలు ధర పెంచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితేనే గగ్గోలు పెట్టారని వాపోయారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమని, నాణ్యతలేని బీర్లు తీసుకొస్తున్నారని అన్నారు. బెల్టు షాపులు బంద్ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడూ సమాధానం చెప్పాలన్నారు.
News February 13, 2025
ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వండి: డీకే అరుణ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లా అలంపూర్ లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్‌తో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.
News February 12, 2025
మన్యంకొండకు పోటెత్తిన భక్త జనం

పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లానుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్ధరాత్రి జరిగే (తెరు) రథోత్సవాన్ని వీక్షించడానికి భక్తజనం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కాలినడకన కదలి రావడం జరిగింది. గోవిందా.. హరి.. గోవిందా అంటూ గోవిందా నామాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.