News February 5, 2025
ఎన్టీఆర్: ఫైనాన్షియల్ కమిటీలో ఎంపికైన జిల్లా నేతలు వీరే

రాష్ట్ర శాసనసభ వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ స్పీకర్ అయన్నపాత్రుడు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కమిటీలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య, MLC మొండితోక అరుణ్(నందిగామ)పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. కాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో ఉన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 4, 2025
కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.
News November 4, 2025
వీళ్ల పంచాయితీ కొలిక్కి వచ్చేనా?

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకానున్నారు. ఉదయం 11గం కొలికిపూడి, మధ్యాహ్నం 4గంటలకు చిన్నీ హాజరవుతారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అధ్యక్షతన కమిటీ సభ్యులు నేతల వివరణలు తీసుకోనున్నారు. మరి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం సీఎం చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
News November 4, 2025
వంటింటి చిట్కాలు

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో  ఇంగువ ముక్క ఉంచండి.
*  బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. 


