News March 20, 2025

ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన బీటెక్ 1వ సెమిస్టర్ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మార్చి 24వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సీటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. 

Similar News

News March 28, 2025

నల్గొండ: సమస్యలపై అడిషనల్ కలెక్టర్‌కు వినతి

image

ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. 6 గ్యారంటీలను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతి అందించారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగార్జున, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

News March 28, 2025

సిరిసిల్ల: లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డిఎంహెచ్వో

image

ప్రవేట్ స్కానింగ్ సెంటర్‌లో లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ.. స్కానింగ్ సంబంధించిన ధరల పట్టిక, ఇతర సర్టిఫికెట్లను గోడలపై ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లు ప్రదర్శించేలా చూడాలని పేర్కొన్నారు. వైద్యులు అంజలినా ఆల్ఫ్రైడ్, శోభారాణి ఉన్నారు.

News March 28, 2025

పాడేరు: సోషల్ స్టడీస్ పరీక్ష తేదీ మార్పు

image

పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష తేదీ మారినట్లు అల్లూరి జిల్లా DEO బ్రహ్మాజీరావు శుక్రవారం రాత్రి మీడియాకు తెలిపారు. ఈనెల 31న నిర్వహించవలసిన పరీక్ష రంజాన్ సెలవు దినం కావడంతో ఏప్రిల్ 1న జరుగుతుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర పరీక్షల కేంద్రం(అమరావతి) సంచాలకులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

error: Content is protected !!