News March 21, 2024

ఎన్టీఆర్: బీసీ మంత్రం పని చేసేనా.?

image

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.

Similar News

News November 30, 2025

కృష్ణా: యువకుడి ప్రాణం తీసిన కుక్క

image

కంకిపాడు మండలం ఈడుపుగల్లు హైవేపై రామాలయం వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో వణుకూరుకు చెందిన కుమారవర్ధన్ (28) మృతిచెందాడు. కుమారవర్ధన్ బుల్లెట్‌పై వస్తుండగా, కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 29, 2025

కృష్ణా: కంటైనర్‌లతో ధాన్యం రవాణా.!

image

జిల్లాలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నప్పటికీ రవాణా వాహనాల లభ్యత లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ధాన్యాన్ని లారీలు, ట్రక్కుల ద్వారా స్టాక్ పాయింట్లకు తరలించే విధానాన్ని అనుసరించేవారు. అయితే ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయంగా కంటైనర్లలో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని లోడింగ్ చేసి స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు.

News November 29, 2025

నేడే కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

image

కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సభ్యులు, అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో వివిధ అంశాలు, ఎంజెండాలపై చర్చ ఉంటుందని చెప్పారు.