News April 14, 2025
ఎన్టీఆర్: బీ-ఫార్మసీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 19, 22, 24, 26, 29, మే 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్సిటీ పరిధిలోని 3 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరారు.
Similar News
News November 24, 2025
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై సీఎం సమీక్ష

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.
News November 24, 2025
గణపవరం ఇటా? ఆటా?.. సందిగ్ధంలో ప్రజలు

గణపవరం మండలం ఏలూరు జిల్లాలోనా, పశ్చిమ గోదావరి జిల్లాలోనా అని మండల ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం ఏలూరు జిల్లాలో ఉన్న మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. ఇప్పుడు సబ్ కమిటీ వారు తిరిగి ఏలూరు జిల్లాలో కలుపుతూ గెజిట్ జారీ చేసారు. ఈనేపథ్యంలో కూటమి నాయకులు ఆందోళన బాటపట్టారు. ఒకవర్గం ఏలూరు జిల్లాలో, మరొక వర్గం పశ్చిమలో ఉంచాలని ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>


