News April 14, 2025

ఎన్టీఆర్: బీ-ఫార్మసీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 19, 22, 24, 26, 29, మే 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్సిటీ పరిధిలోని 3 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు. 

Similar News

News February 12, 2026

KMR: మొదటగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లే!

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా ఓటు హక్కు కలిగి ఉండి పోలింగ్ విధుల్లోని సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. జిల్లాలో 385 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌ల వారీగా ఓట్లు లెక్కిస్తారు.

News February 12, 2026

రమణీయం.. బ్రహ్మోత్సవం

image

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం నీలకంఠుడు భ్రమరాంబ సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. రావణుడి భుజస్కందాలను అధిష్ఠించిన ఉత్సవ మూర్తులకు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. రావణవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.

News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.