News March 9, 2025
ఎన్టీఆర్: బీ. ఫార్మసీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కళాశాలల్లో బీ. ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3,5వ సెమిస్టర్ (రెగ్యులర్) థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 11లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ సెమిస్టర్ ఈనెల 26 నుంచి, 5వ సెమిస్టర్ ఈనెల 25 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.
Similar News
News January 15, 2026
మునగ సాగుతో ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉమేశ్ సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 15, 2026
NGKL: పండుగ రోజు విషాదం.. బావిలో శవాలై తేలారు.!

పండుగ వేళ కొల్లాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన వరలక్ష్మి(18), లావణ్య(12) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన లావణ్య మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. పోలీసులు మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో చుక్కాయపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 15, 2026
నేటి నుంచి U-19 వన్డే వరల్డ్ కప్

జింబాబ్వేలో నేటి నుంచి ICC U-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జులవాయో వేదికగా ఇవాళ భారత జట్టు USAను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 16 సార్లు టోర్నీ జరగ్గా IND 5 టైటిళ్లు గెలిచింది. ఆరోసారి కప్ సొంతం చేసుకోవాలని ఆయుష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇక 14ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలిచింది. అటు ఇవాళ ఇతర మ్యాచుల్లో జింబాబ్వే-స్కాట్లాండ్, టాంజానియా-వెస్టిండీస్ పోటీ పడనున్నాయి.


