News June 29, 2024

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జులై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో అర్హులైన 2,70,966 మందికి రూ.184.70 కోట్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని 54 సచివాలయాల్లో 4,349 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News October 22, 2025

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

image

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO దేవి వైద్యులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన అర్జీలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వైద్య సేవలపై ప్రజల్లో మంచి దృక్పథం వచ్చేలా ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలను అందించాలన్నారు.

News October 22, 2025

పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

image

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.

News October 22, 2025

గుత్తి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

image

గుత్తి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ జగదీశ్ బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. ముందుగా సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్ గౌరవ వందనంతో ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు స్టేషన్‌ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్‌ రోస్టర్‌, వివిధ క్రైమ్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.