News March 18, 2025
ఎన్టీఆర్: భూ కేటాయింపులపై క్యాబినెట్ భేటీలో ఆమోదం

అమరావతిలో భూకేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సోమవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో జరిగిన 31 కేటాయింపులకు ఆమోదం తెలుపుతూ మరో 38 కేటాయింపులకు సవరణలు చేస్తూ ఉపసంఘం సూచనలు చేసింది. 14 కేటాయింపుల రద్దు, 6 కొత్త సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ సిఫార్సులు చేయగా..వాటన్నింటిని క్యాబినెట్ ఆమోదించింది.
Similar News
News November 21, 2025
BREAKING: జనగామ: ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE

జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ.10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
సిద్దిపేట: ప్రతి వాహనదారుని ప్రాణాలు ముఖ్యం: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో వివిధ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనదారుని ప్రాణాలు ముఖ్యమని పగడ్బందీగా రోడ్ భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News November 21, 2025
వరంగల్: భారీగా పడిపోతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం రూ.2,080 ఉన్న మొక్కజొన్న ధర, బుధవారం రూ.2,030కి పడిపోయింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,010 అయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే మార్కెట్‌లో కొత్త తేజ మిర్చికి రూ.15,021 ధర రాగా, దీపిక మిర్చికి రూ.16 వేల ధర వచ్చింది.


