News February 24, 2025
ఎన్టీఆర్: రేపటితో ముగియనున్న గడువు.. త్వరపడండి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎం.ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(ఫస్ట్, సెకండియర్) రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా రేపు మంగళవారంలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని..ఈ పరీక్షలు మార్చి 17 నుండి నిర్వహిస్తామని, వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.
Similar News
News November 22, 2025
వనపర్తి: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మృతిని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వీపనగండ్లకు చెందిన మౌలాలి 15 రోజుల క్రితం మరణించాడు. మౌలాలి భార్య అలివేల (50) భర్త మరణంతో కుంగిపోయి తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
News November 22, 2025
కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <


