News April 14, 2025

ఎన్టీఆర్: రేపటి నుంచి మొదలుకానున్న దరఖాస్తు ప్రక్రియ

image

SC సామాజికవర్గానికి చెందినవారికి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌కై SC కార్పొరేషన్ ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాలకు అర్హులైనవారు అప్లై చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మిశ సూచించారు. 21- 50 సంవత్సరాలలోపు వారు నిర్ణీత ధ్రువపత్రాలు జతచేసి https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 14 నుంచి మే 10లోపు అప్లై చేసుకోవాలని ఆయన తెలిపారు. 

Similar News

News February 26, 2026

జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం- కలెక్టర్

image

వయోజనులకు అక్షరాభ్యాసం జరిగితేనే రాష్ట్రం, జిల్లా అక్షరాస్యతలో ముందుకు వెళ్తుందని డా.కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయడమే లక్ష్యమన్నారు. వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పాలన్నారు. మార్చి 15న మొదటి దశలో అక్షరాభ్యాసం పొందిన వారికి చివరి పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలన్నారు.

News February 26, 2026

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 98.16% హాజరు

image

కామారెడ్డి జిల్లా కేంద్రం వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,878 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 7,733 మంది హాజరై 145 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా హాజరు శాతం 98.16గా నమోదైంది. పరీక్షా కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.

News February 26, 2026

కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలి: కేంద్ర మంత్రి

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తమ ఆదాయంలో కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. ప్రొఫెషనల్ జర్నలిస్టుల నుంచి మారుమూల ప్రాంతాల క్రియేటర్ల వరకు అందరికీ దీన్ని వర్తింపజేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలు పెరిగిపోతున్నాయని, పబ్లిష్ అయ్యే ప్రతీ కంటెంట్‌కూ ఆయా ప్లాట్‌ఫామ్స్ బాధ్యత వహించాలని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాంక్లేవ్‌లో అన్నారు.