News January 29, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

గుంటూరు(D) నంబూరులో జరుగుతున్న బైబిల్ మిషన్ సభలకు హాజరయ్యే వారికై ఎన్టీఆర్ జిల్లా మీదుగా ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రేపు బుధవారం నంబూరులో రైల్వే అధికారులు హాల్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు నం.17281 నరసాపురం- గుంటూరు, నం.17015 సికింద్రాబాద్- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లు రేపు నంబూరులో ఆగుతాయని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యం: మంత్రి

image

తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంకేతికత, సంస్కృతి, ఆవిష్కరణలతో శాశ్వత సంబంధాలను నెలకొల్పేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. 2047 నాటికి తెలంగాణ “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యంతో సురక్షితమైన నగరంగా మారుతుంది అన్నారు. యువత, మహిళలు, రైతులను శక్తిమంతం చేసేందుకు మానవ మూలధనంపై పెట్టుబడులు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News November 28, 2025

VKB: కారు బైక్, ఢీ.. ఒకరి మృతి

image

నవాబుపేట మండలం, మైతాబ్ ఖాన్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మోమిన్‌పేట మండలం, దేవరపల్లికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు కూడా అదే గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు ఆరా తీస్తున్నారు.

News November 28, 2025

‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

image

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.