News March 28, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News December 7, 2025
పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో వన్డే మ్యాచ్ విజయవంతం

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్కు నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ శంఖబ్రత భాగ్చి ఆధ్వర్యంలో స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని మోహరించి, డ్రోన్లతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన నియంత్రణతో భద్రతను విజయవంతంగా నిర్వహించారు.
News December 7, 2025
SKLM: నేడు ఎన్ఎంఎంఎన్ ఎగ్జామ్..పరీక్షా కేంద్రాలివే

విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ ప్రతిభా ఉపకార వేతనం(ఎన్ఎంఎంఎన్) ద్వారా స్కాలర్షిప్ను అందిస్తుంది. దీని కోసం NMMN ఎగ్జామ్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 8వతరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాగా..ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి నెల రూ.1000లను ఇస్తూ ఏడాదికి రూ.12వేలను అందిస్తుంది. నేడు పలాస, టెక్కలి, శ్రీకాకుళంలో ఉదయం 10-1 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.
News December 7, 2025
నల్గొండ: యాసంగికి నీటి విడుదల ఇలా..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్కు ఆన్, ఆఫ్ పద్ధతిలో సాగు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 80.74 టీఎంసీల విడుదల చేయనుండగా నల్గొండ చీఫ్ ఇంజినీర్ పరిధిలో 43.74 టీఎంసీలు, సూర్యాపేట ఇంజినీర్ పరిధిలో 40 టీఎంసీల అవసరం ఉంటుందని నిర్ధారించారు. 15 రోజులకోసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నారు. NLGలో 4,41,118, SRPTలో 4,74,041 ఎకరాలకు నీరు ఇవ్వనున్నారు.


