News March 30, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

image

వేసవి రద్దీకి అనుగుణంగా విజయవాడ మీదుగా నరసాపురం(NS)- SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07153 NS- SMVB రైలును ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు ప్రతి శుక్రవారం, నం.07154 SMVB- NS మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News November 16, 2025

1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

అర్జీదారులు ‘మీ కోసం కాల్ సెంటర్ 1100’ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

News November 16, 2025

NLG: పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

image

పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా సోమవారం తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

News November 16, 2025

వనపర్తి: వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు

image

వయోవృద్ధుల సంరక్షణ చట్టం-2007 ప్రకారం వృద్ధులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, ఫిర్యాదు చేసిన తక్షణమే తగిన న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి తెలిపారు. సోమవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.