News April 15, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

సికింద్రాబాద్ స్టేషనులో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రూట్‌ను నుంచి రైల్వే అధికారులు మార్చారు. మంగళవారం నుంచి నం.12713 BZA- SC రైలు సికింద్రాబాద్‌కు బదులుగా కాచిగూడ, నం.12714 SC- BZA రైలు కాచిగూడ నుంచి బయలుదేరుతుందన్నారు. నం.12713 మధ్యాహ్నం 12.55కి కాచిగూడ చేరుకుంటుందని, తిరిగి (నం.12714)సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.

Similar News

News January 9, 2026

గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష: ఎస్పీ శబరీశ్

image

జిల్లాలో గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. గంజాయి సాగును అడ్డుకునేందుకు డ్రోన్ వ్యవస్థను వాడుతున్నామన్నారు. నరసింహులపేట మండలంలో వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారి సమాచారం పోలీసులకు అందజేయాలని ప్రజలను కోరారు.

News January 9, 2026

బ్లోఅవుట్ వద్ద సీఎం ఏరియల్ వ్యూ

image

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సిబ్బంది చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం ఆరా తీశారు. ఇటీవల గ్యాస్ బ్లోఅవుట్ జరిగి మంటలు చెలరేగగా ఇంకా అదుపులోకి రాలేదు. పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News January 9, 2026

భూపాలపల్లి: మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం!

image

మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే నియోజకవర్గాల్లో రాజకీయ సందడి మొదలైంది. పోటీకి సిద్ధమవుతున్న వివిధ పార్టీల నేతలు ఇప్పటికే వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈసారి ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో టికెట్ల వేటలో నేతలు తలమునకలయ్యారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు పోటీ పడుతుండటంతో అధిష్ఠానానికి ఎంపిక కత్తిమీద సాములా మారింది.