News March 9, 2025
ఎన్టీఆర్: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో మూడేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(2024- 25 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 10లోపు ఆలస్యం లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్శిటీ తెలిపింది.
Similar News
News October 28, 2025
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
News October 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


