News March 16, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు గమనిక.. ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలో ఆగస్టు 2024లో నిర్వహించిన 5వ, 6వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News April 22, 2025
MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజ్ విద్యార్థులు

ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో బి.సాయి సుష్మ 462/470 (ఎంపీసీ), జె.మధుమిత 426/470(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), విద్యార్థులను ప్రిన్సిపల్ జి.ఉపేందర్ రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
News April 22, 2025
విపత్తులతో ఏ ఒక్కరూ చనిపోకూడదు: అనిత

AP: ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరి ప్రాణాలు పోవడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ‘గత ప్రభుత్వం వంతెనలు, డ్రైనేజీలు, సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తున్నాయి. ఇకపై ఇలాంటివి సంభవించకుండా జాగ్రత్త పడతాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.
News April 22, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

ఫస్ట్ ఇయర్‌లో ‘స్టేట్..’
సంగారెడ్డి – 60.20 శాతంతో 13వ ర్యాంక్
సిద్దిపేట – 51.50 శాతంతో 29వ ర్యాంక్
మెదక్- 49.24 శాతంతో 31వ ర్యాంక్
సెకండ్ ఇయర్‌లో
సంగారెడ్డి – 69.26 శాతంతో 16వ ర్యాంక్
మెదక్ – 61.52 శాతంతో 30వ ర్యాంక్
సిద్దిపేట – 59.56 శాతంతో 31వ ర్యాంక్